‘సీటీమార్’.. సోమవారం నుంచి నాన్‌స్టాప్ కూత

by Shyam |
‘సీటీమార్’.. సోమవారం నుంచి నాన్‌స్టాప్ కూత
X

దిశ, వెబ్‌డెస్క్ : మ్యాచో మ్యాన్ గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సీటీమార్’. సంపత్ నంది డైరెక్షన్‌లో వస్తున్న సినిమాలో తమన్నా భాటియా కబడ్డీ కోచ్‌గా కనిపించబోతుంది. కాగా ఈ సినిమా షూటింగ్ సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలిపారు డైరెక్టర్. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై రూపొందుతున్న స్పోర్ట్స్ యాక్షన్ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తుండగా.. భూమిక చావ్లా, దిగాంగన సూర్యవంశి ప్రధాన పాత్రలో నటించబోతున్నారు.

కాగా ఈ విషయాన్ని తెలిపేందుకు తన కూతురితో జరిగిన కన్వర్జేషన్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు సంపత్ నంది. ఈ ఆదివారం ఎక్కడికి తీసుకెళ్తున్నావ్ అని తత్వ అడిగిందని.. కానీ సోమవారం నుంచి సీటీమార్ షూటింగ్ ఉండటంతో ఎక్కడికీ తీసుకెళ్ళలేక పోతున్నానని చెప్పడంతో.. ‘బాగా చెయ్ పప్పా’ అని ఆల్ ది బెస్ట్ చెప్పిందని తెలిపాడు.

కాగా సంపత్ నంది ఈ సినిమాతో పాటు ఓదెల రైల్వే స్టేషన్‌ సినిమాకు కథ అందిస్తున్నారు. నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి విడుదలైన హెబా పటేల్, సింహ ఫస్ట్ లుక్‌కు మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి.

https://twitter.com/IamSampathNandi/status/1330467566045646848?s=19

Advertisement

Next Story