పాతరోజులు గుర్తుకొచ్చాయి…

by Shyam |
పాతరోజులు గుర్తుకొచ్చాయి…
X

దిశ, వెబ్ డెస్క్: ఆ అభాగ్యుల కోసం నాడు బాణాలు, బందూకులు పట్టింది. ఇప్పుడు అదే చోట ప్రజాప్రతినిధిగా పర్యటిస్తూ వారికి అండగా ఉంటూ ఇతరులకు ఆదర్శనీయంగా నిలిచారు ఎమ్మల్యే సీతక్క. నాడు పీడిత ప్రజల కోసం, ఆదివాసీ, గోండుల హక్కుల కోసం అదే అడవిలో అడవి చుక్కై బాణాలు, బందూకులు పట్టిన చేతులతోనే నేడు కీకారణ్యంలో అభాగ్యులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే సీతక్క ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా అందరి అభినందనలు అందుకుంటున్నారు. లాక్ డౌన్ కొనసాగుతున్నందున ములుగు ఎమ్మెల్యే సీతక్క తన నియోజకవర్గ పరిధిలోని పలు గిరిజన గ్రామాల్లో పర్యటిస్తోంది. కనీసం రోడ్లు కూడా లేని ఆ గ్రామాలకు కాలినడకన వాగులు, వంకలు దాటుకుంటూ వెళ్తున్నారు. ఎడ్లబండ్ల మీద నిత్యావసరాలు తీసుకెళ్లి పంచుతున్నారు.

ఇందుకు సంబంధించి ఓ ఫొటోను ఎమ్మెల్యే సీతక్క తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘‘నేను ఈ వాగు దాటుతుంటే నాకు పాత రోజులు గుర్తుకొచ్చాయని, ఆ సమయంలో నా చేతిలో తుపాకీ ఉండేదని.. ఇప్పుడు కూరగాయలు, బియ్యం ఉన్నాయని కూడా ఆమె అందులో పేర్కొన్నారు.’

Tags: Mulugu, MLA Seethakka, essentials, distribution, social media, photo

Advertisement

Next Story

Most Viewed