- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అస్సాం ఎమ్మెల్యేపై దేశద్రోహం
గువహతి : అస్సాంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంపై దేశ ద్రోహం కేసు ఫైల్ అయింది. పోలీసులు మంగళవారం అతన్ని అరెస్టు చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినా అమీనుల్ ఇస్లాం రాష్ట్రంలోని క్వారంటైన్ సెంటర్లు.. డిటెన్షన్ సెంటర్ల కంటే దారుణంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా కుట్ర చేస్తోందని ఆయన ఆరోపిస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఢిల్లీలోని తబ్లిఘీ జమాత్ సదస్సుకు హాజరై వచ్చిన వారందరినీ మెడికల్ సిబ్బంది వేధింపులకు గురిచేస్తున్నదని, ఆరోగ్యవంతులకు ఇంజెక్షన్లు ఇచ్చి కరై బాధితులుగా చిత్రిస్తున్నదని ఆరోపించారు. ఈ వ్యాఖ్యల కారణంగా పోలీసులు సోమవారం ఆ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచిచారు. కోర్టు జ్యూడీషియల్ కస్టడీకి పంపింది.
Tags:Coronavirus, opposition, MLA Aminul Islam, assam, sedition, arrest