- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓయూలో ఓవర్ యాక్షన్… లోపలికి వచ్చిందని అమ్మాయికి ఫైన్
దిశ, సికింద్రాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్దిని తన సర్టిఫికెట్లు తీసుకొని వెళ్లేందుకు స్కూటీ పై ఓయూకి వచ్చిన తనకు అకారణంగా ఓయూ భద్రతా సిబ్బంది 500 ఫైన్ వేశారు . ఈ ఉదంతంలో ప్రత్యక్ష సాక్షులు జోక్యం చేసుకుని సదరు సిబ్బందికి నచ్చ చెప్పినా వారు వినకుండా ఫైన్ వేసి రసీదు ఇచ్చారు. ఫైన్ వేసిన కొద్ది క్షణాల్లోనే ఈ విషయం గురించి మీడియా ప్రతినిధులకు సమాచారం అందడంతో వారు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ( సి.ఎస్.ఓ) గణపతి జాదవ్ ను వివరణ కోరగా తాను ఫైన్ వేయొద్దని చెప్పానని , అయినా వేశారని ఆయనే చెప్పడం విశేషం . తిరిగి ఆ ఫైన్ను వెనక్కి ఇచ్చేయాలని సిబ్బందికి ఆయన ఆదేశాలు జారీ చేశారు .
ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు … ఓయూలో ఇటీవలే తన చదువు పూర్తి చేసుకున్న అమ్మాయి , తన స్నేహితుడితో కలిసి స్కూటీ పై వర్సిటీకి వచ్చి సర్టిఫికెట్లు తీసుకుని తిరుగు ప్రయాణమైంది . ఓయూలోని వర్క్ షాప్ నుంచి హబ్సీగూడ వైపు మట్టి దారిలో ఆమె వెళ్తుండగా , ఓయూ ఉన్నతాధికారుల కాన్వాయ్ ఎదురైంది, అది చిన్నదారి కావడంతో ఆమె తన ద్విచక్రవాహనాన్ని పక్కకు తిప్పింది . అంతలో అది పొదల్లోకి వెళ్తుండగా వెనకాల ఉన్న స్నేహితుడు దానిని ఆపివేశాడు . అది చూసిన సదరు ఉన్నతాధికారి వారెవరో వాకబు చేయాలని సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు . సాక్షాత్తు ఓయూ వీసీ యే చెప్పడంతో ఇక మాకు ఎదురేముంది అనుకున్నారో ఏమో సెక్యూరిటీ సిబ్బంది రెచ్చిపోయారు . వారి వివరాలు తీసుకుని సి.ఎస్.ఓకు చెప్పారు . దీంతో ఆయన వదిలేయాల్సిందిగా సూచించారు .
అయినా సెక్యూరిటీ సిబ్బంది ఆ అమ్మాయికి రూ .500 జరిమానా విధించారు . ప్రత్యక్ష సాక్షులు జోక్యం చేసుకుని జరిమానా ఎందుకు చెల్లించాలని ప్రశ్నించిగా , ఉన్నతాధికారుల ఆదేశాలని వారు స్పష్టం చేశారు . తమ దగ్గర నగదు లేకపోవడంతో ఫోన్ పే ద్వారా ఆ జరిమానాను చెల్లించారు . జరిమానా రశీదు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . అసలు సదరు సెక్యూరిటీ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఓయూ , భద్రతా సిబ్బందిని మోసం చేస్తోందని మండిపడ్డారు . ఆ సంస్థపై ఇప్పటికే ఓయూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ , ఆ సంస్థకు వారు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు . ప్రైవేటు భద్రతా సిబ్బందికి జరిమానా వేసే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు . ఇప్పటికైనా ఉన్నతాధికారులు తమ స్వప్రయోజనాలను వీడి , ఓయూ ప్రయోజనాలను కాపాడుతూ ప్రైవేట్ భద్రతా సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు .
ఖాళీ రసీదులపై చీఫ్ సెక్యూరిటీ అధికారి సంతకం..
రసీదు బుక్కులో కాలీగా ఉన్న రసీదులపై ముందుగానే ఎంతో విలువైన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సంతకాలు రసీదు బుక్కులో ముందస్తుగా సంతకాలు చేసి పెట్టడంపై విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. పటిష్టమైన భద్రత ఉండాల్సిన ఉస్మానియా యూనివర్సిటీలో భద్రతా సిబ్బంది పనితీరు ఇలాగే ఉంటే వర్సిటీ ప్రతిష్ట దెబ్బతింటుందని, వెంటనే వారిపై చర్యలు తీసుకొని పద్దతి మార్చుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు సి.ఎస్.ఓ దానిని పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని, అలా కాకుండా భద్రతా సిబ్బంది సి.ఎస్.ఓ ముందుగానే సంతకం చేసి పెట్టిన బుక్కులను పట్టుకొని అవగాహన రాహిత్యంతో నడుచుకోవడం సరైన పద్ధతి కాదని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు.
- Tags
- certificates