- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆటో డెబిట్ లావాదేవీల్లో పెరిగిన తిరస్కరణలు
దిశ, వెబ్‌డెస్క్: ఆటో డెబిట్ లావాదేవీల్లో తిరస్కరించిన లావాదేవీల సంఖ్య వరుసగా రెండో నెలలో పెరిగాయని నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(ఎన్ఏసీహెచ్) తెలిపింది. ఈఎంఐ, విద్యుత్, గ్యాస్, ఫోన్ వంటి బిల్లులను చెల్లించేందుకు వినియోగించే ఈ విధానంలో లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోవడంతో తిరస్కరణలు పెరిగాయని ఎన్ఏసీహెచ్ వెల్లడించింది. ఎన్ఏసీహెచ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మే నెలలో మొత్తం 8.57 కోట్ల ఆటో డెబిట్ లావాదేవీల్లో 35.91 శాతం అంటే 3 కోట్ల లావాదేవీలు తిరస్కరించబడ్డాయి. అంతకుముందు ఏప్రిల్ నెలలో మొత్తం 8.54 కోట్ల లావాదేవీల్లో 2.9 కోట్లు అంటే 34.05 లావాదేవీలు తిరస్కరణకు గురైనట్టు ఎన్ఏసీహెచ్ పేర్కొంది.
సెకెండ్ వేవ్ కారణంగా కఠిన లాక్‌డౌన్ ఆంక్షలతో సాధారణ ప్రజల ఆదాయం తగ్గింది. ఆదాయం లేని వారు వారి అకౌంట్లలో అవసరమైన నగదును ఉంచుకోలేకపోయారు. అందుకే తిరస్కరణలు పెరిగాయని ఎన్ఏసీహెచ్ తెలిపింది. గతేడాది ఇదే సమయంలో లావాదేవీలు ఎక్కువగా విఫలమైన తర్వాత ఈ ఏడాది మార్చిలో కరోనాకు ముందుస్థాయికి వచ్చాయి. అయితే, ఏప్రిల్‌లో సెకెండ్ వేవ్ వల్ల ఇవి మళ్లీ పెరిగాయి. లక్షల మంది ఉద్యోగాలను కోల్పోవడంతో ఈఎంఐ, ఇతర ఆర్థిక చెల్లింపులను నిర్వహించలేకపోయారని ఎన్ఏసీహెచ్ వెల్లడించింది.