తెలంగాణలో రేపటి నుండి రెండో డోస్

by Anukaran |
తెలంగాణలో రేపటి నుండి రెండో డోస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రేపటి నుంచి రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం చేపడుతామని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపడుతున్నామని తెలిపారు. మొదటి డోసు పూర్తిచేసుకుని రెండో డోసు కోసం అర్హత కలిగిన వారందరికి వ్యాక్సినేషన్ అందిస్తామన్నారు. అర్హులైన వారు దగ్గరిలోని వ్యాక్సినేషన్ సెంటరకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా సూచించారు. సూపర్ స్ప్రెడర్లను గుర్తించి వారికి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని, అందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని మంత్రి హరీష్ రావును వైద్యారోగ్యశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు.

మే 14 నుంచి చివరి సారిగా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టగా 10 రోజుల తరువాత తిరిగి వ్యాక్సినేషన్ ను ప్రారంభిస్తున్నారు. వ్యాక్సిన్ కొరతతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పూర్తిగా వ్యాక్సిన్ ను నిలిపివేసారు. చివరసారిగా మే 14న మొదటి డోసు వ్యాక్సిన్ ను 833 మందికి అందిచగా, రెండవ డోసు వ్యాక్సిన్ ను 33,160 మందికి అందించారు, ఇప్పటి వరకు మొత్తం మొదటి డోసు వ్యాక్సిన్ ను 43,76,229 మందికి, రెండవ డోసు వ్యాక్సిన్ ను 11,37,032 మందికి పంపిణీ చేపట్టారు. రెండవ డోసు వ్యాక్సిన్ తీసుకోవాల్సన వారి సంఖ్య అధికంగా ఉండటంతో ప్రభుత్వం రెండో డోసు వేసేందుకే ప్రధాన్యతనిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed