- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రెండో రోజూ కొనసాగిన ఉద్యోగుల బదిలీ ఆప్షన్‌ల పరిశీలన
by Shyam |

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కేడర్ ఉద్యోగుల బదిలీల ఆప్షన్ పరిశీలనా కార్యక్రమం రెండో రోజూ జరిగింది. కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆదివారం కలెక్టరేట్లో రెండోరోజు 24 శాఖల్లో పూర్తి చేశారు. దాదాపు 16 వందలు మంది ఉద్యోగుల వివరాలు పరిశీలించారు. సీనియారిటీ ప్రకారం ఆయా జిల్లాల కేడర్ స్ట్రెంత్‌కు అనుగుణంగా కేటాయించారు. కమిటీ చైర్మన్ హోదాలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి.పాటిల్, నిజామాబాద్ సీపీ కార్తికేయ, నిజామాబాద్ స్థానిక సంస్థల కలెక్టర్ చిత్ర మిశ్రా, డీసీపీ నితిన్, అడీసీపీ ఉషా విశ్వనాథ్ పరిశీలిస్తూ ప్రక్రియను కొనసాగించారు. ఆదివారం పోలీస్ శాఖ, జిల్లా పరిషత్, జిల్లా పంచాయతీ, ఎక్సైజ్ తదితర శాఖలలో బదిలీ కౌన్సిలింగ్ జరిగింది.
Next Story