రెండో రోజు ఐదు గంటల విచారణ

by srinivas |
రెండో రోజు ఐదు గంటల విచారణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఈఎస్‌ఐ మందుల కొనుగోలు వ్యవహారంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు రెండో రోజు విచారించారు. సుమారు 5 గంటలపాటు విచారణ సాగింది. మొదటగా గుంటూరు జనరల్ ఆస్పత్రిలో ఆయనకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక వార్డుకు తరలించి అక్కడే విచారణ ప్రారంభించారు. రేపు కూడా విచారించనున్నట్లు అధికారులు తెలిపారు. విచారణ సమయంలో అచ్చెన్నాయుడితో పాటు అతని తరుపు న్యాయవాదిని, డాక్టర్‌ను కూడా అనుమతించారు. విచారణ మొత్తాన్ని రికార్డు చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.



Next Story

Most Viewed