- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా సెకెండ్ వేవ్‌తో 'తీవ్ర అనిశ్చితి'కి సిద్ధం కావాలి : నీతి ఆయోగ్ వైస్-ఛైర్మన్
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ సెకెండ్ వేవ్ కారణంగా వినియోగం, పెట్టుబడుల సెంటిమెంట్ అంశాల్లో ‘తీవ్రమైన అనిశ్చితి’ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, అవసరమైన సమయంలో ప్రభుత్వం ఆర్థిక చర్యలు తీసుకుంటుందని నీతి ఆయోగ్ వైస్-ఛైర్మన్ రాజీవ్ కుమార్ చెప్పారు. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న కారణంగా పరిస్థితి గతం కంటే క్లిష్టంగా మారినప్పటికీ 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థికవ్యవస్థ 11 శాతం వృద్ధిని సాధించగలదని కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ కొవిడ్‌ను ధీటుగా ఎదుర్కొంటున్నప్పటికీ యూకే, ఇతర దేశాల నుంచి కొత్త వేరియంట్‌లు పరిస్థితులను ప్రతికూలంగా మారుస్తున్నాయని రాజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
సేవల రంగం వంటి కొన్ని రంగాలపై ప్రత్యక్ష ప్రభావంతో సంబంధం లేకుండా సెకెండ్ వేవ్ అనిశ్చితిని పెంచుతుంది. దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలపై పరోక్షంగా ప్రభావం అత్యధికంగా ఉంటుంది. కాబట్టి వినియోగం, పెట్టుబడుల అంశాల్లో అనిశ్చితికి సిద్ధంగా ఉండాలని కుమారు వివరించారు. అలాగే, కరోనా సెకెండ్ వేవ్ ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ పూర్తిస్థాయిలో విశ్లేషించిన తర్వాతే నూతన ఆర్థిక ఉద్దీపన అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆయన తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి వృద్ధి 11 శాతంగా ఉంటుందని కుమారు అంచనా వేశారు. కాగా, ఆర్‌బీఐ ఇటీవల ద్రవ్య విధాన సమీక్షలో వృద్ధి 10.5 శాతంగా అంచనా వేయగా, ఈ ఏడాది ప్రారంభంలో ప్రవేశపెట్టిన ఎకనమిక్ సర్వే ఈ ఏడాది 11 శాతం వృద్ధి అంచనా వేసింది. ఇక, అధికారిక అంచనాల ప్రకారం 2020-21లో దేశ ఆర్థికవ్యవస్థ 8 శాతం ప్రతికూలంగా ఉండే అవకాశాలున్నాయి.