- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రలోభాల నివారణకు ఐఏఎస్, ఐపీఎస్లు
దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ ఎన్నికల్లో ప్రలోభాల పర్వంపై రాష్ట్ర ఎన్నికల సంఘం అత్యవసరంగా స్పందించింది. పలు చోట్ల నోట్ల పంపిణీ యథేచ్ఛగా సాగుతున్న అంశాలు దృష్టికి రావడంతో నిఘా పెంచేందుకు ఏర్పాట్లు చేసింది. దీని కోసం సోమవారం నుంచి ప్రత్యేకాధికారులను నియమించింది. వారి ఫోన్ నెంబర్లను అందుబాటులో పెట్టింది. సర్కిళ్ల వారీగా అధికారులను కేటాయించింది. మొత్తం 12 మంది ఉన్నతాధికారులకు ఈ బాధ్యతలను అప్పగించారు.
టీఆర్ఎస్ పార్టీ నుంచి భారీగా నగదు పంపిణీ చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కొన్నిచోట్ల పోలీసులే నగదు పంపిణీ చేస్తున్నారంటూ బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రలోభాల పర్వాన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధి ప్రకటించారు. రాజకీయ పార్టీలు, కార్యకర్తలు ఎన్నికల అక్రమాలకు పాల్పడినా, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలకు పాల్పడినా, మరే ఇతర ఫిర్యాదులు ఉన్నా సంబంధిత ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేయాలని ఎస్ఈసీ పార్థసారధి కోరారు.