- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల సామగ్రి ఎత్తుకెళ్లడం అమానుషం : నిమ్మగడ్డ
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు రాజ్యాంగాన్ని అవమానించడమే అని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్‌కు స్వీయ నియంత్రణ ఉందని, తన జీవితంలో ఎన్నడూ సెల్ఫ్ కంట్రోల్ కోల్పోలేదని చెప్పుకొచ్చారు. ఏ రాజకీయ పార్టీ, వ్యక్తిపై కక్ష సాధింపు చర్యలకు దిగలేదన్నారు.
ఎన్నికలు నిర్వహించే సమయంలో ఏకగ్రీవాలు రాజ్యంగాన్ని అవమానించడమే అన్నారు. ఎన్నికల కమిషన్‌పై కేసులు పెట్టడం, ఎన్నికల సామగ్రిని ఎత్తుకెళ్లడం అమానుషమని నిమ్మగడ్డ మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో 20శాతం ఏకగ్రీవాలు సర్వసాధారణమని చెప్పే ప్రయత్నం చేశారు. ఇదిలాఉండగా, స్థానిక ఎన్నికల విషయంలో ఏపీ ప్రభుత్వానికి, ఎస్‌ఈసీకు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.