ఏపీ సీఎస్, డీజీపీని అభినందిచిన నిమ్మగడ్డ

by srinivas |
ap sec
X

దిశ, ఏపీ బ్యూరో: తొలి దశ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినందుకు ఎస్​ఈసీ నిమ్మగడ్డ సీఎస్, డీజీపీలను అభినందించారు. విజయవాడలో గురువారం ఎస్​ఈసీతో సీఎస్ ఆధిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. మిగతా మూడు దశల్లో జరగనున్న ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. భద్రతా అంశాలతోపాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఎస్​ఈసీ పలు సూచనలు చేశారు.

ఫిర్యాదుల స్వీకరణకు కాల్ సెంటర్‌

ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణకు విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 0866 2466877 కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని నిమ్మగడ్డ తెలిపారు. ప్రతి ఫిర్యాదు నమోదు చేయాలని కాల్ సెంటర్ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్‌వోలకు ఫిర్యాదులు పంపాలని సిబ్బందికి సూచించారు.

Advertisement

Next Story

Most Viewed