నిధులివ్వట్లేదు.. ఇబ్బందులు వస్తున్నయ్

by srinivas |
నిధులివ్వట్లేదు.. ఇబ్బందులు వస్తున్నయ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వ తీరుపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సంఘం నిర్వహణకు ప్రభుత్వం నుంచి నిధులు రాక ఇబ్బందులు వస్తున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎస్ఈసీ వ్యవహారంలో మొదట్నుంచి ప్రభుత్వ వైఖరిని గమనిస్తున్నామని న్యాయమూర్తి వ్యాఖ్యానించగా.. ఏదైనా అవసరం ఉంటే తమను సంప్రదించాలని ప్రభుత్వ తరపు న్యాయవాది సూచించారు. ఇదే క్రమంలో మళ్లీ స్పందించిన హైకోర్టు తాము గమనిస్తే తప్పేంటని ప్రశ్నించింది. ప్రభుత్వ వైఖరితో ఎస్ఈసీ హైకోర్టును ఆశ్రయించడం బాధాకరమని అభిప్రాయపడింది. ప్రభుత్వం చెబుతున్న ఇబ్బందులపై సవివరమైన అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఎస్ఈసీని హైకోర్టు ఆదేశించింది.



Next Story

Most Viewed