గవర్నర్‎తో ముగిసిన నిమ్మగడ్డ భేటీ

by Anukaran |
గవర్నర్‎తో ముగిసిన నిమ్మగడ్డ భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‎ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలిశారు. 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ప్రభుత్వ వైఖరిపై గవర్నర్‎కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. స్ధానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వివిధ పార్టీల ప్రతినిధులు వెల్లడించిన అభిప్రాయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

ఎస్ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఉండడం లేదని గవర్నర్‎కు తెలిపారు. పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా ఏపీలో మాత్రం కరోనా పేరుతో అడ్డుకునేందుకు ప్రభుత్వం చూస్తుందన్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎస్ఈసీ లాంటి సంస్థలను చిన్నబుచ్చే విధంగా ప్రభుత్వం అధికారులను ప్రొత్సహిస్తుందని నిమ్మగడ్డ వెల్లడించారు. కోర్టుల్లో ఇవే విషయాలను అఫిడవిట్ రూపంలో పేర్కొన్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story