- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మంత్రి కొడాలి నానికి మరో షాక్..
by srinivas |

X
దిశ,వెబ్‌డెస్క్: మంత్రి కొడాలి నానికి ఎస్ఈసీ మరో సారి షాక్ ఇచ్చింది. తాజాగా నానిపై ఎస్ఈసీ ఆంక్షలు విధించింది. ఈ నెల 21 వరకు ఆయన మీడియాతో మాట్లాడకూడదని ఎస్ఈసీ ఆంక్షలు విధించింది. సభలు, సమావేశాల్లోనూ మాట్లాడకూడదని మంత్రికి ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆదేశాలను అమలు చేయాలని కలెక్టర్,ఎస్పీ, సీపీకి ఎస్ఈసీ ఆదేశించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని ఎస్ఈసీ తెలిపింది.
కాగా ఎస్ఈసీపై మంత్రి కొడాలి నాని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని మంత్రికి ఎస్ఈసీ నోటీసులు జారీ చేసింది. నోటీసులకు మంత్రి వివరణపై ఎస్ఈసీ సంతృప్తి చెందక పోవడంతో తాజాగా మంత్రిపై ఆంక్షలు విధించింది.
Next Story