‘పెట్టుబడి వ్యూహాలు జాగ్రత్తగా ఉండాలి’

by  |
‘పెట్టుబడి వ్యూహాలు జాగ్రత్తగా ఉండాలి’
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 సంక్షోభ సమయంలో పెట్టుబడుల వ్యూహాలను తగిన రీతిలో, జాగ్రత్తగా క్రమబద్దీకరించడం అవసరమని సెబీ పూర్తికాల సభ్యుడు జీ మహాలింగం తెలిపారు. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీరేట్లు తగ్గడం కేపిటల్ మార్కెట్లలో రిటైల్ మదుపర్లు ఇన్వెస్ట్‌మెంట్ చేసేందుకు కారణమవకూడదని ఆయన సూచించారు. రిటైల్ మదుపర్ల ప్రయోజనాల నిమిత్తం మార్కెట్లను సురక్షితంగా, భద్రంగా ఉంచేందుకు సెబీ ఎప్పటికప్పుడు కృషి చేస్తోందని మహాలింగం వివరించారు.

ఎంసీసీఐ నిర్వహించిన వెబ్‌నార్‌లో మాట్లాడిన ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంక్ డిపాజిట్ రేట్లు దిగొస్తున్న తరుణంలో చిన్న చిన్న పెట్టుబడిదారులు అతిజాగ్రత్తగా వ్యూహాలను రూపొందించుకోవాలని తెలిపారు. కేపిటల్ మార్కెట్లలో అత్యంత జాగ్రత్తగా మదుపు చేయాల్సి ఉంటుందని, పెట్టిన పెట్టుబడులు సహేతుకమైన రాబడిని ఆశించడం ఉత్తమమని, దురాశకు వెళ్లొద్దని ఆయన సూచించారు. మ్యూచువల్ ఫండ్స్ నుంచి కూడా ఇదే ఆశించడం ముఖ్యమన్నారు. మార్కెట్లను దీర్ఘకాల పెట్టుబడులకు సురక్షితమైనదిగా మార్చడానికి కృషి చేస్తున్నట్టు, కార్పొరేట్ బాండ్ మార్కెట్ అభివృద్ధికి రిటైల్, ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడం మేలని తాను ఆశిస్తున్నట్టు మహాలింగం పేర్కొన్నారు.


Next Story