యూనివర్సిటీల వీసీల కోసం సెర్చ్ కమిటీ

దిశ, ఏపీబ్యూరో: ఏపీలోని అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్‌లర్ల ఎంపిక కోసం ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. వర్సిటీల ఎంపిక కోసం సెర్చ్ కమిటీని నియమిస్తూ నోటీఫికేషన్ జారీ చేసింది.

దీంతో రాష్ట్రంలోని కీలక యూనివర్సిటీలుగా పేరొందిన.. ఆచార్య నాగర్జు, ఆంధ్ర, కృష్ణ దేవరాయ, శ్రీ వెంకటేశ్వర, రాయలసీమ విశ్వవిద్యాలయాల్లో సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నామినీలు ఉండనున్నారు. దేశంలోని ప్రముఖ వర్సిటీల వీసీలు ఇందులో నామినీలుగా వ్యవహరించనున్నారు.

Advertisement