అడవి జంతువుల నుంచే కరోనా.. ఎవరు చెప్పారంటే?

by vinod kumar |
అడవి జంతువుల నుంచే కరోనా.. ఎవరు చెప్పారంటే?
X

దిశ, వెబ్‌డెస్క్:

చైనాలోని వూహాన్ నగరంలో తొలిసారిగా కనుగొన్న కరోనా వైరస్ పుట్టుకపై అనేక అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ఇది చైనాలోని ల్యాబ్‌లో సృష్టించబడిందని ఒకరు.. వైరస్ సృష్టించబడలేదు కానీ అక్కడి ల్యాబ్ నుంచి పొరపాటున లీకై బయటకు వచ్చిందని మరొకరు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా పరిశోధకులు కరోనా పుట్టుకపై అధ్యయనం చేశారు. యూనివర్సిటీ ల్యాబ్‌లో కృత్రిమంగా వాతావరణం సృష్టించి.. అడవి జంతువుల నుంచి మనుషులకు ఎలా వ్యాపించిందో నిరూపించారు. ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ పౌలా కాలన్ ఈ పరిశోధనలకు నేతృత్వం వహించారు. కరోనా వైరస్ జంతువుల నుంచే మనుషులకు సోకిందని.. ఒక్క కరోనా వైరసే కాదు గత దశాబ్ద కాలంగా భూమిపై మనుషులకు సోకిన వైరస్‌లు అన్నీ అడవి జంతువుల మూలంగానే వ్యాపించాయని వారు అంటున్నారు. వైరస్ పుట్టడానికి ఒక వాతావరణం సృష్టించగా.. అతి తక్కువ కాలంలోనే అది ఉనికిలోకి వచ్చిందని వారు గుర్తించారు. ఇప్పుడు తగ్గిపోయినా ఈ వైరస్ కొద్ది కాలం తర్వాత మళ్లీ విజృంభిస్తుందని కూడా ఆమె చెప్పారు. గుర్రపునాడ ఆకారంలో ఉండే గబ్బిలాల ద్వారానే ఈ వైరస్ పుట్టిందని.. గబ్బిలాల నుంచి మనుషులకు ఎలా సోకిందో కూడా తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని పౌలా కానన్ వెల్లడించారు. ల్యాబ్‌ నుంచి లీకై ఈ వైరస్ వ్యాపించిందనడంలో వాస్తవం ఉండకపోవచ్చు. వూహాన్ నగరంలోని వెట్ మార్కెట్ నుంచి వైరస్ మనుషులకు సోకిందన్న థియరీకి వీరి పరిశోధనలు బలం చేకూరుస్తున్నాయి.

Tags: Covid-19, Corona, USC, Paula Cannon, Wildlife, Outbreak, Link, Bats

Advertisement

Next Story

Most Viewed