ఆ చెరువుల్లో కరోనా జన్యుపదార్థాలు?

by Shyam |   ( Updated:2021-05-15 04:18:02.0  )
ఆ చెరువుల్లో కరోనా జన్యుపదార్థాలు?
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచంలో కరోనా విలయతాడవం చేస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌లో కరోనా వైరస్ జన్యు పదార్థాలు కనిపించాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అలానే నాచారం, నిజాం చెరువులో కూడా జన్యుపదార్థాలు ఉన్నట్టుగా వారు పేర్కొన్నారు. కానీ నగర వాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కరోనా వైరస్ నీటిద్వారా వ్యాపించదనే విషయం ఒక అధ్యయనంలో వెల్లడైందని తెలిపారు. ఈ అధ్యయనాన్ని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ,సీసీఎంబీ సంయుక్తంగా నిర్వహించాయి. ఈఅధ్యయనం మూడో వేవ్ను గుర్తించడానికి ఉపయోగపడుతుందని వారు తెలిపారు. అలానే ఈ జన్యు పదార్థాలు ఫిబ్రవరి నుంచి పెరగడం మొదలైందని, అయితే చెరువుల్లోని వైరస్ జన్యు పదార్థం మరింతగా విస్తరించలేదని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed