వాటి వయసు 101.5 మిలియన్ సంవత్సరాలు

by  |
వాటి వయసు 101.5 మిలియన్ సంవత్సరాలు
X

దిశ, వెబ్‌డెస్క్ :
మనిషికి, జంతువులకే కాదు.. పుట్టిన ప్రతి జీవికి ఓ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అయితే ఈ భూమ్మీద ఎక్స్‌పైరీ డేట్ లేని అంటే లైఫ్ స్పాన్ లేని జీవులు కూడా ఉన్నాయని తాజా అధ్యయనంలో తేలింది. కొన్ని శతాబ్దాలుగా సముద్రపు అడుగు భాగాన నిద్రాణమై ఉన్న సూక్ష్మజీవులను పునరుద్ధరించిన శాస్త్రవేత్తలు ఎన్నో ఆసక్తికర విషయాలను కనుగొన్నారు.

జపాన్ ఏజెన్సీ ఫర్ మెరైన్, ఎర్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ నేతృత్వంలోని ఓ బృందం దక్షిణ పసిఫిక్ సముద్రతీరంలో 101.5 మిలియన్ సంవత్సరాల కిందటి పురాతన అవక్షేప నమూనాలను పరీక్షించింది. అయితే ఈ అవక్షేపాలున్న ప్రాంతం కొన్ని కోట్ల బ్యాక్టీ రియాలకు కేంద్రంగా మారింది. ఒక్క క్యూబిక్ సెంటిమీటర్‌కు మిలియన్ సెల్స్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో శాస్త్రవేత్తలు ఇక్కడ మిలియన్‌ సంవత్సరాలుగా జీవించిన సూక్ష్మజీవులన్నింటినీ తిరిగి పునరుద్ధరించగలిగారు. శాస్త్రవేత్తలు పునరుద్ధరించిన సూక్ష్మజీవుల జీవితాన్ని విశ్లేషించగా.. అసలు వాటికి జీవితకాలం అనేదే లేదని తేల్చారు. తక్కువ స్థాయిలో ఆహారం దొరికినా, ఇవి అక్కడ మనుగడ సాగిస్తున్నట్లు తేల్చారు. అంతేకాదు అవి ఏండ్లకేళ్లుగా జీవించడమే కాకుండా తమ సంఖ్యను రెట్టింపు స్థాయిలో పెంచుకుంటున్నాయని గుర్తించినట్లు సైంటిస్టులు తెలిపారు. అవక్షేపాల్లో తాము ఆక్సిజన్‌ జాడలను కనుగొన్నామని, దీన్ని బట్టి ఈ మైక్రోబ్స్‌కు శక్తి లేకున్నా ఆక్సిజన్‌తోనే బతికేస్తున్నట్లు అర్థమవుతున్నదని శాస్త్రవేత్తల బృందం అభిప్రాయపడింది. కాగా ఈ అధ్యయనం నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది.



Next Story

Most Viewed