- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆశ్చర్యం.. ఆ దేశంలో భూమి మీద నడిచే నాలుగు కాళ్ల తిమింగలం!
దిశ, ఫీచర్స్ : ఈజిప్టులో 43 మిలియన్ ఏళ్ల పురాతన తిమింగల శిలాజాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది భూమిపై నడిస్తూ, నీటిలో ఈదేదని దీనికి నాలుగు కాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఉభయచర జీవుల పరిణామక్రమాన్ని తెలుసుకునేందుకు ఇది సహాయపడుతుందని ‘రాయల్ సొసైటీ బి పీర్-రివ్యూ జర్నల్ ప్రొసీడింగ్స్’ అధ్యయన ఫలితాలు తాజాగా ప్రచురితమయ్యాయి.
ఈజిప్ట్ పశ్చిమ ఎడారి, ఫయుమ్ డిప్రెషన్‌లోని మధ్య ఇయోసిన్ శిలల నుంచి ఈ శిలాజాన్ని వెలికితీయగా, దీనికి ‘ఫియోమిసెటస్ అనుబిస్’ అని పేరు పెట్టారు. కొత్తగా కనుగొన్న జాతులు అంతరించిపోయిన ‘ప్రోటోసెటిడ్స్’ అని పిలిచే సెమియాక్వాటిక్ తిమింగలాల సమూహానికి చెందిందని వారు భావిస్తున్నారు. ఇది ఈయోసిన్ కాలంలో ఉనికిలో ఉండగా.. 56 మిలియన్ – 33.9 మిలియన్ ఏళ్లక్రితం జీవించి ఉండవచ్చన్నారు. ఈ ఉభయచర తిమింగళాలు దాదాపు మూడు మీటర్ల పొడవు సుమారు 600 కిలోల శరీర బరువు కలిగి ఉంటుందని, ఇది ఒక ప్రెడేటర్ అని పరిశోధకులు తెలిపారు. కెనైన్ హెడ్ ఈజిప్ట్ గాడ్‌ను తలపించేలా ‘అనుబిస్’ తిమింగలం ఉండటం విశేషం. తిమింగలాలు భూమిపై నివసించేవని, ఆ తర్వాత అవి సముద్ర జలాల్లోకి మారి ఉంటాయని, ఈ శిలాజం ఆధారంగా తిమింగలాల పరిణామ మార్పు గురించి కొత్త వివరాలను వెల్లడించే అవకాశం ఉందని వాళ్లు వివరించారు.
‘ఇది శక్తివంతమైన దవడలు కలిగి ఉంది. ఎంత పెద్ద జీవినైనా నోటితో చంపేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ తిమింగలం దాని ప్రాంతంలో నివసించే చాలా జంతువులకు ‘మరణ దేవత’(గాడ్ ఆఫ్ డెత్) అని చెప్పొచ్చు. దీన్ని కనుగొన్న ప్రదేశం ఒకప్పుడు సముద్రగర్భ ప్రాంతం ‘జర్మన్ పాలియోంటాలజిస్ట్ ఎబెర్‌హార్డ్ ఫ్రాస్’ కాగా 1904లో ఓ తిమింగిల శిలాజంతోపాటు.. అనేక ప్రోటోసెటిడ్స్ ఇక్కడ దొరికాయి. పరిశోధకులతో కలిసి మన్సౌరా యూనివర్శిటీ వెర్టిబ్రేట్ పాలియోంటాలజీ సెంటర్‌లో అనుబిస్ శిలాజాన్ని అధ్యయనం చేశాం. అరబ్ బృందం కనుగొన్న తిమింగలం శిలాజానికి పేరు పెట్టడం ఇదే మొదటిసారి.
-హెషమ్ సల్లం, సైంటిస్ట్ అండ్ రైటర్