అద్భుత సృష్టి.. అందుబాటులోకి ‘3D చెవి’ అవయవాలు..

by Anukaran |   ( Updated:2021-08-24 07:01:28.0  )
Human Ear in 3D
X

దిశ, వెబ్‌డెస్క్ : పెరుగుతున్న సాంకేతికత కొత్త కొత్త ఆవిష్కరణలతో మానవాళిని ఆశ్చర్య పరుస్తోంది. ఇప్పటికే రోబోలను కనిపెట్టి మానవ అవసరాలకు ఉపయోగపడేలా వాటిని డిజైన్ చేసేస్తున్నారు. అంతేకాకుండా ఎలాంటి రోగాన్నైనా ఇట్టే కనిపెట్టే స్కానింగ్ పరికరాలు వచ్చేశాయి. కానీ వీటన్నింటినీ మైమరిపించేలా ఏకంగా మానవ అవయవాలను సైతం తయారు చేసే పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలో కృత్రిమ చెవి తయారీ త్రీడీ ప్రింటర్స్ వచ్చేశాయి.

నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది గాయాలపాలవుతున్నారు. వీరిలో ఎక్కువగా తలకి తీవ్రంగా దెబ్బలు తగిలి ఏకంగా చెవులు కట్ అయిన వారిని చూస్తున్నాం. ఇలాంటి వారు చెవి లేకపోవడంతో ఎంతో ఇబ్బందికరంగా ఉంటున్నారు. ఇలాంటి వారి కోసమే త్రీడీ ప్రింటర్లు వచ్చేశాయి. దీన్ని యూనివర్సిటీ ఆఫ్ వొల్లొంగాంగ్ ఆస్ట్రేలియా సహకారంతో ఎ.యం.టి.జెడ్ ‘ఆర్గెన్’ సంస్థ అభివృద్ధి చేసింది.

ఈ త్రీడి ప్రింటింగ్‌తో ఏకంగా చెవిని తయారుచేసి శరీరానికి అమర్చేస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరికరం ద్వారా పుట్టుకతోనే చెవులు లేకుండా ఉండే వారికి చెవులు అమరుస్తామని వారు చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అవయవాలు తయారు చేసేందుకు పరిశోధనలు జరుగుతున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed