- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొత్త చేప జాతిని అనుకోకుండా సృష్టించిన శాస్త్రవేత్తలు
అంతరించిపోతున్న జంతువులను పునఃసృష్టి చేయడానికి శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఇటీవల దిశ కథనంలో తెలుసుకున్నాం. ఆ క్రమంలో స్టర్జియన్ అనే చేపను సృష్టించడానికి హంగేరీ శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. అందుకోసం ప్యాడిల్ ఫిష్ శుక్రకణాలను దాచిపెట్టి ఉంచి స్టర్జియన్ అండాలతో గైనోజెనెసెస్ విధానం ద్వారా కలపాలనుకున్నారు. అయితే వారి ప్రయోగం కొత్త ఫలితాలను చూపించి వేరే జాతిని ఒకదాన్ని సృష్టించారు. దానికి ‘స్ట్రడిల్ ఫిష్’ అని పేరు కూడా పెట్టారు.
గైనోజెనెసెస్‌లో డీఎన్ఏ కాకుండా శుక్రకణాలు ఉపయోగించడం వల్ల ఇలా కొత్త జాతి చేప తయారైందని అక్వాటిక్ ఎకాలజిస్ట్ సోలోమన్ డేవిడ్ అన్నారు. అయితే కొత్త జాతిలో ఎక్కువగా స్టర్జియన్ జాతి చేపలోని లక్షణాలే కనిపించాయని, దీన్ని బట్టి ఈ ప్రయోగంలో తాము దాదాపుగా విజయం సాధించినట్లేనని ఆయన తెలిపారు. ఈ స్ట్రడిల్ ఫిష్‌ను లోతుగా అధ్యయనం చేసి, దాని జీవావరణ పరిస్థితులను తట్టుకునే శక్తిని అంచనా వేసిన తర్వాతే వాస్తవ పరిస్థితుల్లో విడిచిపెడతామని చెప్పారు. దీన్ని ‘హైబ్రిడైజేషన్ ఫిష్’గా పరిగణించనున్నట్లు వెల్లడించారు.