సెప్టెంబర్ 21 నుంచి స్కూల్స్ రీఓపెన్..!

దిశ, వెబ్‎డెస్క్:

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యాసంస్థలు బంద్ అయ్యాయి. అన్‎లాక్ ప్రక్రియ కొనసాగుతుండడంతో తాజాగా విద్యాసంస్థలను తెరిచేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21 నుంచి 9-12 చదువుతున్న విద్యార్థులను స్కూళ్లకు వెళ్లేందుకు అనమతిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ పలు సూచనలు జారీ చేసింది.

కరోనా వ్యాప్తి దృష్టా భద్రతా చర్యలతో కూడిన వివరణాత్మక మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. విద్యార్థులు సందేహాల నివృత్తి, సలహాలు, సూచనల కోసం టీచర్లను కలిసేందుకు స్కూళ్లకు వెళ్లేందుకు అనుమతిచ్చింది. అయితే క్లాసులో విద్యార్థులు, సిబ్బంది మధ్య ఆరడుగుల దూరం పాటించడంతో పాటు మాస్కును తప్పనిసరిగా ధరించాలని సూచించింది. ప్రస్తుతానికి 50 శాతం బోధన, బోధనేతర సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొంది. అయితే విద్యార్థులు తప్పనిసరిగా స్కూల్‎కు వెళ్లాలని నిబంధనేమి లేదని.. స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించారు.

Advertisement