బడి గంటలు మోగనున్నాయి….

by srinivas |
బడి గంటలు మోగనున్నాయి….
X

దిశ, వెబ్ డెస్క్:
ఏపీలో సోమవారం నుంచి బడి గంటలు మోగనున్నాయని మంత్రి ఆది మూలపు సురేశ్ అన్నారు. కరోనా కారణంగా 5నెలల ఆలస్యంగా తరగతులు ప్రారంభమవుతున్నాయని ఆయన అన్నారు. కేంద్ర అన్ లాక్ 5.0 సూచనలకు అనుగుణంగా పాఠశాలలను ప్రారంభిస్తున్నట్టు ఆయన తెలిపారు. తొమ్మిది, పది, ఇంటర్ సెకండియర్ తరగతులు నవంబర్ 2 నుంచి ప్రారంభం అవుతాయని వెల్లడించారు. అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు ,గురుకుల పాఠశాలలు నవంబర్ 23 నుంచి ఓపెన్ అవుతాయని అన్నారు. ఆరు, ఏడు, ఎనిమిదవ తరగతి విద్యార్థులకు తరగతులు నవంబర్ 23న ప్రారంభం కానున్నట్టు తెలిపారు. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు తరగతులు డిసెంబర్ 14 నుంచి ప్రారంభం అవుతాయని తెలిపారు. పాఠశాలలకు సంబంధించి పరీక్షల ప్రణాళిక షెడ్యూల్ కూడా రూపొందించామని చెప్పారు. 180 రోజులు పని దినాలు ఉండేలా విద్యా సంవత్సరం రూపొందించామని అన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని సూచించారు. ప్రతి విద్యార్థీ భౌతిక దూరం పాటించేలా ,తరగతి గదులు ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసే విధంగా ప్రత్యేక ఆదేశాలను జారీ చేశామని వెల్లడించారు. ప్రస్తుతం ఒక్క పూట మాత్రమే తరగతులను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులను ఇళ్లకు పంపిస్తామని ఆయన తెలిపారు.

Advertisement

Next Story