అక్టోబర్ 2 నుంచి స్కూళ్లు ప్రారంభం

by Shamantha N |   ( Updated:2021-09-24 01:41:15.0  )
Schools in Maharashtra
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు మూతపడిన విషయం తెలిసిందే. అయితే.. పలు రాష్ట్రాలు అక్కడ ఉన్న కరోనా పరిస్థితులను బట్టి, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రీ-ఓపెన్ చేశాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కూడా త్వరలోనే స్కూళ్లు, కాలేజీలను రీ-ఓపెన్ చేసి ప్రత్యక్ష తరగతులను ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం మాట్లాడుతూ.. వచ్చే నెల 2 నుంచి స్కూళ్లు, కాలేజీలు రీ-ఓపెన్ చేసే అవకాశముందని ఆయన చెప్పారు. కరోనా పరిస్థితులను బట్టి టాస్క్‌ఫోర్స్ సూచనలతో తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ను దాదాపు పూర్తి చేశామని చెప్పారు. ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ మాట్లాడుతూ.. వచ్చే నెల 2 నుంచి స్కూళ్లు, కాలేజీలు రీ-ఓపెన్ అయ్యే అవకాశముందని తెలిపారు.

Advertisement

Next Story