తిరుపతి లోక్ సభ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల

by srinivas |   ( Updated:2021-03-16 08:02:11.0  )
tirupati bypoll
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి లోక్ సభ, నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 23న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు మార్చి 30 తేది చివరితేదిగా ప్రకటించింది. నామినేషన్ల పరిశీలనకు మార్చి 31 చివరి తేదీకాగా…. ఏప్రిల్ 3న నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీగా ప్రకటించింది. ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుంది. ఇకపోతే మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఏప్రిల్ నెలలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి.

అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల రోజునే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఫలితం వెల్లడికానుంది. ఇకపోతే తిరుపతి లోక్ సభ అభ్యర్థి ఎంపికపై ఆయా పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మిని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక వైసీపీ నుంచి డా.గురుమూర్తి బరిలో దిగబోతున్నారు. మరోవైపు బీజేపీ-జనసేన పార్టీ తరపున ఉమ్మడి అభ్యర్థిగా దాసరి శ్రీనివాసులు బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ చింతా మోహన్ బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే తిరుపతి ఎంపీగా 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాదరావు గెలుపొందారు. అయితే కరోనాతో ఆయన మృతి చెందడంతో ఉపఎన్నిక అనివార్యమైంది.

Advertisement

Next Story

Most Viewed