- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
తృటిలో తప్పిన ప్రమాదం.. హీరోను లాక్కెళ్లిన టిల్లర్!
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: మలయాళ మూవీ ‘వెల్లం’ షూటింగ్ స్పాట్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ సీన్ చిత్రీకరణలో భాగంగా హీరో జయసూర్య పవర్ టిల్లర్ నడుపుతుండగా.. అదుపు తప్పి తనను కొద్ది దూరం లాక్కెళ్లింది. వెంటనే అప్రమత్తమైన యూనిట్ సభ్యులు, సిబ్బంది ఆయన్ను రక్షించారు. అయితే ప్రమాదం నుంచి హీరో సురక్షితంగా బయటపడ్డాడని మూవీ యూనిట్ వెల్లడించింది. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ‘వెల్లం’ చిత్రబృందం సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది వైరల్‌గా మారింది.
ప్రకాష్‌సేన్ దర్శకత్వంలో వస్తున్న ‘వెల్లం’ మూవీలో జయసూర్య హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుందని, చివరి షెడ్యూల్‌లో ఈ ఘటన జరిగిందని తెలిపిన డైరెక్టర్.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాగా ఈ చిత్రానికి రాబి వర్ఘీస్ రాజ్ సినిమాటోగ్రాఫర్.
Next Story