క్యూఆర్ స్కాన్ చెయ్.. నెంబర్ సేవ్ చెయ్!

by  |
క్యూఆర్ స్కాన్ చెయ్.. నెంబర్ సేవ్ చెయ్!
X

ఎవరితోనైనా ఫోన్‌లో మాట్లాడుతున్నపుడు ఏదైనా వాట్సాప్ చేయాల్సి వస్తే ముందుగా వాళ్లని వాళ్ల నెంబర్ నుంచి హాయ్ అని మెసేజ్ పెట్టమని చెబుతుంటాం. ఎందుకంటే.. మళ్లీ వాళ్ల నెంబర్ సేవ్ చేయడానికి బద్ధకం. అదే వాళ్లే ‘హాయ్’ అని మెసేజ్ చేస్తే ప్రత్యేకంగా నెంబర్ సేవ్ చేయకుండానే ఆ మెసేజ్‌కు రిప్లై ఇవ్వొచ్చు. అయితే వాట్సాప్‌లో ఇప్పటికి ఎన్నో ఫీచర్లు వచ్చాయి. కానీ సేవ్ చేయని నెంబర్‌కు నేరుగా వాట్సాప్ మెసేజ్ చేసే అవకాశం రాలేదు. ఇద్దరిలో ఎవరో ఒకరు తప్పనిసరిగా నెంబర్ సేవ్ చేసుకోవాల్సిందే!

ఇకపై ఆ అవసరం ఉండదు, తాజా ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో వాట్సాప్ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ప్రతి నెంబరుకు ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఈ కోడ్‌లో సంబంధిత ఫోన్ నెంబర్ నిక్షిప్తమై ఉంటుంది. దీన్ని స్కాన్ చేయడం ద్వారా నేరుగా ఫోన్ నెంబర్‌ను సేవ్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ సెట్టింగ్‌లో ఉండే ఈ క్యూఆర్ కోడ్‌ను కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ ఫేజ్‌లో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed