- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దిశ వెబ్ డెస్క్: రైల్వే ఉద్యోగం మీ కలా? రైల్వే ఉద్యోగానికి దరఖాస్తు చేశారా? అయితే మీరు జాగ్రత్తగా ఉండండి . రైల్వేలో ఉద్యోగం వచ్చిందని లక్షల్లో డబ్బు వసూలు చేస్తోంది ఓ ముఠా. బాధితుడి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. నిరుద్యోగులే టార్గెట్ గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఉపాధి వేటలో ఉన్న యువతనే లక్ష్యంగా చేసుకున్న కంత్రిగాళ్లు..నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపి లక్ష్యల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు . అయితే హైదరాబాద్ లో రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామంటు మోసాలకు పాల్పడ్డారు. మీకు రైల్వేలో జాబ్ ఖరారైందని 40 మందికి మూడు నెలలుగా ట్రైనింగ్ ఇచ్చారు. మీకు ఇక ఉద్యోగం ఇచ్చామంటూ ఒక్కొక్కరి దగ్గర రూ. లక్షల్లో వసూలు చేసింది ఓముఠా. ఎన్ని రోజులైనా పోస్టింగ్ ఇవ్వకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు సభ్యులు గల ముఠాను అదుపులోకి తీసుకున్నారు.