- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IMDb ఆల్‌టైమ్ ఫేవరేట్స్‌లో ‘స్కామ్ 1992’
దిశ, సినిమా: అప్లాజ్ ఎంటర్‌టైన్మెంట్‌కు అప్లాడ్ ఇవ్వాల్సిన సమయం ఇది. స్కామ్‌స్టర్స్‌కు సెల్యూట్ చేయాల్సిన టైం. 2020 హర్షద్ మెహతా బయోపిక్ సిరీస్ ‘స్కామ్ 1992’ (Scam 1992) ఇండియన్ సినిమా గర్వపడే అచీవ్‌మెంట్ సాధించింది. భారత్ నుంచి ఏ ఇతర సిరీస్ లేదా టెలివిజన్ షో సాధించిన ఫీట్ సాధించింది. ఆల్ టైం హైలీ రేటెడ్ IMDb మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ అండ్ టెలివిజన్ సీరియల్స్‌లో లిస్ట్‌లో తొమ్మిదో స్థానాన్ని కొట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా 163 టైటిల్స్ ఈ లిస్ట్‌లో ఉండగా.. భారత్ నుంచి ఒకే ఒక్క ఎంట్రీ ‘స్కామ్ 1992’ నిలవడం విశేషం. అప్లాజ్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిన సిరీస్‌కు హన్సల్ మెహతా డైరెక్టర్ కాగా.. ప్రతీక్ గాంధీ టైటిల్ రోల్ ప్లే చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రతీక్.. ‘స్కామ్ 1992’ ఇంత వరకు వెళ్తుందని ఊహించలేదన్నాడు. హర్షద్ మెహతా క్యారెక్టర్ ప్లే చేసేందుకు కారణం తమ డైరెక్టర్ హన్సల్ మెహతానే అన్న హీరో.. ఈ సక్సెస్ క్రెడిట్ అంతా దర్శక, నిర్మాతలకు దక్కుతుందన్నాడు. రియల్ లైఫ్ క్యారెక్టర్ ప్లే చేయడం ఇష్టమన్న ప్రతీక్.. గాంధీ గారి పాత్రతో సహా చాలా క్యారెక్టర్లు స్టేజిపై పర్ఫార్మ్ చేశానని తెలిపాడు. ఇలాంటి పాత్రలెప్పుడూ చాలెంజింగ్‌గా ఉంటాయన్నాడు ప్రతీక్.