- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టారిఫ్‌ల వివరాలు ట్రాయ్‌కు ఇవ్వాలి -సుప్రీం
దిశ, వెబ్‌డెస్క్: ప్రత్యేక టారిఫ్‌లపై టెలికాం ఆపరేటర్లు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాల నుంచి వివరాలు కోరాలని టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ అభ్యర్థనను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని రెగ్యులేటర్‌ను కోరుతూ, ప్రైవేట్ రంగ టెలికాం కంపెనీలు, వివరాలు ట్రాయ్‌కు ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ వివరాలు ఎవరికీ తెలియకూడదని, ముఖ్యంగా పోటీదారులకు చేరకూడదని ప్రధాన న్యాయమూర్తి అరవింద్ బోబ్డే నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.
వివరాలు కోరేందుకు ట్రాయ్ చర్యలు పారదర్శకంగా ఉండాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ప్రత్యేక టారిఫ్‌ల వివరాల సమాచారం బహిర్గతం చేయడంపై టెలికాం కంపెనీలు, రెగ్యులేటరీ మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఇదివరకు ఎయిర్‌టెల్, వొడాఫోన్ సంస్థలు ట్రిబ్యునల్ ముందుకెళ్లగా, ట్రాయ్‌కు అలాంటి సమాచారం అడిగేందుకు అధికారం లేదని ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. టెలికాం ఆపరేటర్లు ఇలాంటి సమాచారాన్ని బహిర్గతం చేయడాన్ని తప్పనిసరి చేయాలన్న ట్రాయ్ చర్యను ఎయిర్‌టెల్, వొడాఫోన్ వ్యతిరేకించాయి.