కేసీఆర్ మరో సంచలనం.. ‘దళిత విప్లవం’ దిశగా అడుగులు!

by Sridhar Babu |   ( Updated:2021-07-24 11:52:41.0  )
dalita-viplavam
X

దిశ,హుజురాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా బండ శ్రీనివాస్‌ను నియమించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపేందుకు శనివారం హుజురాబాద్ నుండి 70 వాహనాల్లో సుమారు 500 మంది హైదరాబాద్‌కు తరలివెళ్లారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. దళిత కాలనీలో దళితులపై ఉన్న కేసులను మాఫీ చేయడానికి పోలీసు అధికారులతో చర్చించిస్తామన్నారు. అంతేకాకుండా దళిత కాలనీల అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కృషి చేయాలన్నారు.

గ్రామాల్లో దళితుల అభివృద్ధికి టీఆర్ఎస్ మార్క్ చూపించకుండా అందరినీ కలుపుకుపోయి దళిత విప్లవాన్ని తీసుకురావాలని పిలుపునిచ్చారు. దళిత బంధు పథకం కోసం హుజరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని కేసీఆర్ వివరించారు. కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తామని, ఈ డబ్బులతో జీవనోపాధి కోసం పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా బలపడాలని సీఎం తెలిపారు. ఈ దళిత బంధు పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా హుజూరాబాద్ నియోజకవర్గం నుండే ప్రారంభిస్తున్నట్లు్ స్పష్టంచేశారు.ఈ పథకం విజయవంతానికి దళితులంతా తమ వంతు కృషి చేయాలని కోరారు. దళితులంతా సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story