SBI కొత్త పని విధానం.. 'వర్క్ ఫ్రమ్ ఎనీవేర్'!

by Shyam |   ( Updated:2020-07-14 06:41:35.0  )
SBI కొత్త పని విధానం.. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్!
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సరికొత్త పని విధానంతో ఉద్యోగులకు పని భారాన్ని తగ్గించనుంది. ఇప్పటికే అనేక సంస్థలు ఉద్యోగులకు రక్షణగా వర్క్ ఫ్రమ్ హోమ్ పని విధానాన్ని అమలు పరుస్తున్నాయి. అయితే, ఎస్‌బీఐ ఇంకో అడుగు ముందుకేసి తమ ఉద్యోగులు ఎక్కడి నుంచి అయినా పని చేసే వ్యవస్థ (వర్క్ ఫ్రమ్ ఎనీవేర్)ను మొదలుపెట్టనున్నట్టు ఎస్‌బీఐ ఛైర్మన్ రజనీష్ చెప్పారు. అలాగే, వినియోగదారుల కోసం కాంటాక్ట్‌లెస్ డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందించనుంది. ‘ఎస్‌బీఐ ఉద్యోగులు ఏ ప్రాంతం నుంచైనా పని చేసే కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించాం. ఉద్యోగుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని, దీని ద్వారా సంస్థకు రూ. 1000 కోట్ల వరకు ఆదా అవుతుంది’ అని రజనీష్ వెల్లడించారు. ‘కరోనా వైరస్ డిజిటల్ బ్యాంకింగ్‌ పై ఎక్కువ దృష్టి సారించేలా చేసింది. కరోనాకు ముందు కంటే ఇప్పుడు ఎస్‌బీఐ యూనో చాలా వృద్ధి సాధించినట్లు, వినియోగదారులు యూనో వ్యాలెట్‌ను పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు’ అని పేర్కొన్నారు. రానున్న ఆరు నెలల సమయంలో యూనో రిజిస్ట్రేషన్‌లు రెట్టింపు చేయడానికి, గృహ రుణాలు, వ్యక్తిగత బంగారు రుణాలు, ఇదివరకే ఆమోదించిన రుణాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని రజనీష్ తెలిపారు.

Advertisement

Next Story