జీడీపీ మరింత క్షీణించే అవకాశం : ఎస్‌బీఐ ఎకోరాప్

by Harish |
జీడీపీ మరింత క్షీణించే అవకాశం : ఎస్‌బీఐ ఎకోరాప్
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత జీడీపీ 23.9 శాతం క్షీణించినట్టు గణాంకాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లోనూ భారత ఆర్థిక వ్యవస్థ దారుణంగా క్షీణించే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రెండు త్రైమాసికాల్లో ప్రతికూలత తప్పదని, చివరి త్రైమాసికంలో కొంత సానుకూలత ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత వాస్తవ జీడీపీ 10.9 శాతం ఉండొచ్చని ఎస్‌బీఐ పరిశోధనా నివేదిక ఎకోరాప్ అంచనా వేసింది. ఇదివరకు 6.8 శాతం ప్రతికూలతను అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అన్ని త్రైమాసికాల్లోనూ ప్రతికూల జీడీపీ నమోదయ్యే అవకాశాలున్నాయి. దీనివల్ల పూర్తి ఆర్థిక సంవత్సరం 10.9 శాతం మేర క్షీణించవచ్చు.

రెండో త్రైమాసికంలో 12 నుంచి 15 శాతం ప్రతికూలత, మూడో త్రైమాసికంలో 5 నుంచి 10 శాతం ప్రతికూలత, నాలుగో త్రైమాసికంలో 2 నుంచి 5 శాతం క్షీణించవచ్చని ఎస్‌బీఐ ఎకోరాప్ అంచనా వేసింది. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రైవేట్ వినియోగ వ్యయం భారీగా క్షీణించే అవకాశాలున్నాయని, నిత్యావసరాలకు తప్పించి మిగిలిన వాటికి డిమాండ్ లేదని, వినియోగ సామర్థ్యం తగ్గి పెట్టుబడుల్లో రికవరీ కనిపించడంలేదని వెల్లడించింది.

కానీ, ప్రతికూలతలోనూ సానుకూల అంశాలున్నాయని ఎస్‌బీఐ ఎకోరాప్ నివేదిక తెలిపింది. జులైలో ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం..ఎంఎస్ఎంఈ, వ్యవసాయ అనుబంధ రనాల రుణాల్లో వృద్ధి, అలాగే.. తొలి త్రైమాసికంలో పలు రంగాల్లో కొత్త ప్రాజెక్టులు. విద్యుత్, రోడ్లు, ప్రాథమిక రసాయనాలు, నీరు, ఆసుపత్రులు ఇందులో ఉన్నాయి. కాగా, వాణిజ్య, విమానయాన, నిర్మాణ రంగాలను పునరుద్ధరినాల్సీ అవసరముందని ఎస్‌బీఐ ఎకోరాప్ నివేదిక తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed