SBI, HDFC లైఫ్ ఇన్సూరెన్స్ త్రైమాసిక ఫలితాలు!

by Harish |   ( Updated:2020-07-21 09:20:06.0  )
SBI, HDFC లైఫ్ ఇన్సూరెన్స్ త్రైమాసిక ఫలితాలు!
X

దిశ, వెబ్‌డెస్క్ :
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నికర లాభం 5.11 శాతం వృద్ధితో రూ. 390.89 కోట్లను నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికానికి రూ. 371.90 కోట్ల నికర లాభాన్ని చూపించింది. నికర ప్రీమియం ఆదాయం తొలి త్రైమాసికంలో రూ. 6,655.02 కోట్ల నుంచి 14 శాతం పెరిగి రూ. 7,588.09 కోట్లకు చేరుకుంది. సమీక్షీంచిన త్రైమాసికంలో పెట్టుబడుల ద్వారా వచ్చిన ఆదాయం 188 శాతం పెరిగి రూ. 8,582.80 కోట్లకు చేరుకుంది. సమీక్షించిన తొలి త్రైమాసికంలో ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహణలో ఉన్న ఆస్తులు 19 శాతం పెరిగి రూ. 1,75,350 కోట్లకు చేరుకున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ప్రకటించింది.

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ నికర లాభం రూ. 451 కోట్లు

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ మంగళవారం 2020-21 ఆర్థిక సంవత్సరానికి తొలి త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 6 శాతం వృద్ధితో రూ. 451 కోట్లను నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 425 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. నికర ప్రీమియం ఆదాయం 11 శాతం క్షీణించి రూ. 5,734 కోట్లకు చేరుకుంది. సమీక్షించిన త్రైమాసికంలో ఆదాయం 4 రెట్లు పెరిగి రూ. 8,749 కోట్లకు చేరింది. కొవిడ్-19 ప్రభావంపై స్పందించిన సంస్థ కరోనా ప్రభావంతో బీమా, దీర్ఘకాలిక పొదుపు రెండింటికీ ప్రాధాన్యత పెరిగిందని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో విభ పాదల్కర్ తెలిపారు. దేశవ్యాప్తంగా 75 శాతం శాఖలు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని కంపెనీ తెలిపింది.3

Advertisement

Next Story