ఎస్‌బీఐ న్యూ ఫీచర్: ఏటీఎం మోసాలకు చెక్  

by Harish |
ఎస్‌బీఐ న్యూ ఫీచర్: ఏటీఎం మోసాలకు చెక్  
X

దిశ, వెబ్ డెస్క్: కస్టమర్ల సేఫ్టీ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా కస్టమర్లు ఏటీఎంకు వెళ్లి బ్యాలెన్స్ చూడాలన్నా లేదా మినీ స్టేట్మెంట్ తీసుకొనే ప్రయత్నం చేసినా… ఎస్‌బీఐ అకౌంట్ తో లింక్ అయిన ఫోన్ నంబర్ కు ఒక ఎస్ఎంఎస్ పంపి అలర్ట్ చేస్తుంది. ఏటీఎం మోసాలను చెక్ పెట్టేందుకు ఈ ఫీచర్ సహకరిస్తుంది.

ఈ ఫీచర్ గురించి ట్విట్టర్ ద్వారా తెలిపిన ఎస్‌బీఐ… బ్యాలెన్స్ ఎంక్వైరీ లేదా మినీ-స్టేట్మెంట్ గురించిన ఎస్ఎంఎస్ హెచ్చరికలను అవాయిడ్ చేయొద్దని కోరింది. కేటుగాళ్లు మీ ఏటీఎం కార్డును ఉపయొస్తున్నారని తెలిస్తే వెంటనే డెబిట్ కార్డు బ్లాక్ చేయడానికి ఉపయోగపడుతుందని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed