SBI ఖాతాదారులకు భారీ షాక్..

by srinivas |
SBI
X

దిశ, వెబ్‌డెస్క్ : వినియోగదారులకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) భారీ షాక్ ఇచ్చింది. గురువారం (జూలై 1వ తేదీ) నుంచి కొన్ని నిబంధనలను మార్చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. ఎస్‌బీఐ బేసిక్‌ సేవింగ్స్‌ అకౌంట్‌ సర్వీసు ఛార్జీలను సవరించింది. బ్యాంక్‌లో నగదు ఉపసంహరణ, ఏటీఎం విత్‌డ్రాయల్స్‌, చెక్‌ బుక్స్‌, ట్రాన్స్‌ఫర్‌, నాన్‌ ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్లకు సవరించిన కొత్త సర్వీస్‌ చార్జీలు జూలై 1 నుంచి వర్తిస్తాయని బ్యాంకు వెల్లడించింది.

ఏటీఎం ట్రాన్సాక్షన్స్ :

ఒక్క నెలలో ఫ్రీ ట్రాన్సాక్షన్స్ పూర్తైన తర్వాత(4 ఉచిత లావాదేవీలు) ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ. 15 ఛార్జీ విధించనుంది. ఛార్జీతో పాటు జీఎస్‌టీ అదనంగా విధించనున్నారు. ఇక, ఎస్‌బీఐ శాఖల్లో నగదు విత్‌డ్రా చేసినా చార్జీ పడుతుంది.

చెక్ బుక్కుకు కూడా లిమిట్ :

చెక్కులు కూడా ఏడాదికి 10కి మించితే అదనపు ఛార్జీ వేసేందుకు ఎస్‌బీఐ రెడీ అయ్యింది. ఎస్‌బీఐ ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్ లీవ్స్‌ను ఉచితంగా అందిస్తుంది. ఒక వేళ 10 చెక్ లీవ్స్ అయిపోతే.. అదనంగా మరో 10 చెక్ లీవ్స్ కోసం రూ.40, 25 పేజీల చెక్ లీవ్స్ కోసం రూ. 75(GST అదనంగా) చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ నిబంధన నుంచి సీనియర్ సిటిజన్లను మినహాయించారు.

ఇక, చెక్‌ను ఉపయోగించి నగదు ఉపసంహరణను SBI రోజుకు లక్ష రూపాయల వరకు పెంచింది. అలాగే సేవింగ్స్‌, పాస్‌బుక్‌తో పాటు ఫారమ్‌ను ఉపయోగించి నగదు ఉపసంహరణను రోజుకు రూ.25 వేలకు పెంచారు.

Advertisement

Next Story

Most Viewed