- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎస్‌బీఐ కార్డ్స్ లాభాలు జూమ్
దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి త్రైమాసికంలో ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ నికర లాభం ఏకంగా 110 శాతం పెరిగి రూ. 175 కోట్లుగా నమోదు చేసింది. దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ ప్రమోట్ చేస్తున్న ఈ సంస్థ అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 84 కోట్ల లాభాలను ఆర్జించింది. సమీక్షించిన త్రైమాసికంలో సంస్థ ఆదాయం రూ. 2,468 కోట్ల నుంచి రూ. 2,309 కోట్లకు తగ్గిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
మార్చి త్రైమాసికంలో సంస్థ మొత్తం వ్యయం రూ. 2,234 కోట్లుగా పేర్కొంది. ఇక, 2020-21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంస్థ లాభం 21 శాతం తగ్గి రూ. 985 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఇది రూ. 1,245 కోట్లుగా నమోదైంది. ఈ ఏడాది మార్చి చివరిన్ నాటికి ఎస్‌బీఐ కార్డ్స్ స్థూల నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) 2.01 శాతం నుంచి 4.49 శాతానికి రెట్టింపు నమోదైంది. అలాగే, నికర ఎన్‌పీఏలు 0.67 శాతం నుంచి 1.15 శాతానికి పెరిగాయి. ఎస్‌బీఐ కార్డ్స్ సంస్థ 2020, మార్చిలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టింగ్ అయిన సంగతి తెలిసిందే.