- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బాక్సింగ్ నేర్చుకుంటున్న సయేషా

దిశ, వెబ్‌డెస్క్:‘అఖిల్’ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సయేషా సైగల్.. ఆ తర్వాత తమిళ్‌లో బిజీ అయిపోయింది. తమిళ హీరో ఆర్యను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయిన సయేషా.. భర్త ప్రోత్సాహంతో తన కెరియర్ కంటిన్యూ చేస్తోంది. సాధారణంగా ఎప్పుడూ డ్యాన్సింగ్ వీడియోలతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌కు ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చే భామ.. సరికొత్తగా బాక్సింగ్ చేస్తున్న వీడియో అప్‌లోడ్ చేసింది. భర్త ఇచ్చిన స్ఫూర్తితో బాక్సింగ్ నేర్చుకుంటున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఆర్య ఓ సినిమా కోసం బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటుండగా.. బాక్సింగ్ పార్టనర్‌గా వైఫ్ కూడా జాయిన్ అయింది. దీంతో వండర్ ఫుల్ కపుల్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు ఫ్యాన్స్.
https://twitter.com/arya_offl/status/1302126877629243392?s=20
కాగా ‘పా’ రంజిత్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా కోసమే ఇద్దరూ ఇలా ట్రెయిన్ అవుతున్నారని సమాచారం. కె9 స్టూడియోస్ నిర్మాణ సారథ్యంలో వస్తున్న చిత్రం ఫస్ట్ లుక్ ఇప్పటికే రిలీజ్ కాగా.. ఆర్య సిక్స్ ప్యాక్ లుక్‌కు ఫిదా అయ్యారు ఫ్యాన్స్.