జూమ్‌కు పోటీ.. ‘సే నమస్తే’ వీడియో కాలింగ్

by  |
జూమ్‌కు పోటీ.. ‘సే నమస్తే’ వీడియో కాలింగ్
X

దిశ, వెబ్ డెస్క్: లాక్‌డౌన్ 5.0లో కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో జనాలు రోడ్ల మీదకొస్తున్నారు. కానీ, కరోనా విజృభిస్తుండటంతో ఇప్పటికీ చాలా ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అవకాశమిచ్చాయి. దీంతో రెగ్యులర్ మీటింగ్స్ కోసం టెకీలు.. జూమ్, గూగుల్ మీట్ వంటి వీడియో కాలింగ్ యాప్స్‌ను ఉపయోగించాల్సి వస్తోంది. కానీ, సెక్యూరిటీ, ప్రైవసీ కారణాలతో కేంద్ర ప్రభుత్వం ‘జూమ్’ యాప్‌ను వాడొద్దంటూ ఇటీవల ఆదేశాలు జారీ చేయడంతో చాలామంది ఆ యాప్‌ను వాడటం లేదు. ‘వీడియో కాలింగ్ యాప్’లు తయారు చేయాల్సిందిగా భారత ప్రభుత్వం మన దేశ స్టార్టప్‌లకు సూచించింది. ఈ నేపథ్యంలో చాలా స్టార్టప్ కంపెనీలు తమ తమ వీడియో కాలింగ్ యాప్‌లను అభివృద్ది చేశాయి. ఇదే క్రమంలో ముంబైకి చెందిన స్టార్టప్ కంపెనీ ఇన్‌స్క్రిప్ట్.. ‘సే నమస్తే’ వీడియో కాన్ఫరెన్స్ యాప్‌ను డెవలప్ చేసింది.

‘సే నమస్తే’ వీడియో కాలింగ్ యాప్ మొన్నటి వరకు వెబ్ వర్షన్‌లోనే అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ఇది గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ గ్రూప్ వీడియో కాల్‌లో 50 మంది యూజర్లు పార్టిసిపేట్ చేయొచ్చు. స్ర్కీన్ షేరింగ్, టెక్ట్స్ మోడ్, ఫైల్ షేరింగ్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ‘ప్రైవసీ, సెక్యూరిటీ పరంగా అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతం మా యాప్‌ను లక్ష మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. 4.5 స్టార్ రేటింగ్ ఉంది. ఎప్పటికప్పుడు మా యాప్‌లోని లోపాలు సరిదిద్దుతూ.. యూజర్ ఫ్రెండ్లీ కోసం నిరంతరం కష్టపడుతున్నాం’ అని సే నమస్తే సీఈవో అనుజ్ గార్గ్ తెలిపారు.


Next Story