అమెరికా టు ప్రగతిభవన్.. సీఎం పరిశీలనలో 250 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు!

by Shyam |   ( Updated:2021-05-30 05:48:18.0  )
అమెరికా టు ప్రగతిభవన్.. సీఎం పరిశీలనలో 250 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు!
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు ఇప్పుడిపుడే తగ్గుముఖం పడుతున్నాయి. కొవిడ్ కేసుల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే, కొవిడ్ రోగుల సౌకర్యార్థం అమెరికాలోని అట్లాంట నుంచి తెలంగాణకు 250 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు చేరుకున్నాయి.

వీటిని శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా ప్రగతి భవన్‌కు తరలించారు. కాసేపట్లో వీటిని ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించనున్నట్లు సమాచారం. సావలి ఫౌండేషన్ సభ్యులు కొవిడ్ నేపథ్యం దృష్ట్యా ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed