వారిని ఆకర్షించేందుకు సౌదీ కొత్త ఫ్లాన్.. ‘ది రిగ్’ పేరుతో స్పెషల్ ఏర్పాటు

by Shyam |
వారిని ఆకర్షించేందుకు సౌదీ కొత్త ఫ్లాన్..  ‘ది రిగ్’ పేరుతో స్పెషల్ ఏర్పాటు
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నాల్లో భాగంగా సౌదీ అరేబియా.. పాత ఆఫ్‌షోర్ ఆయిల్ ప్లాట్‌ఫామ్‌ను ఆయిల్- థీమ్ పార్క్‌గా మార్చే ప్రణాళికలను ప్రకటించింది. ‘ది రిగ్’ పేరుతో రాబోయే ఆఫ్‌షోర్ థీమ్ పార్క్ సౌదీ విజన్ 2030 వ్యూహంలో భాగంగా రూపొందనుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు వీలుగా దాని పర్యాటక పరిశ్రమను పెంచడమే లక్ష్యంగా తీసుకురానుంది.

‘రిగ్’ సౌదీ అరేబియా, గల్ఫ్‌ ప్రాంతంలో ఉంది. 1.6 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఎక్స్‌ట్రీమ్ థీమ్ పార్క్‌లో మూడు హోటళ్లు, దాదాపు డజను ప్రపంచ స్థాయి రెస్టారెంట్స్, అలాగే రోలర్ కోస్టర్ రైడ్స్, బంగీ జంపింగ్, స్కైడైవింగ్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు థ్రిల్లింగ్ రైడ్స్‌, ఆక్వాటిక్ అడ్వెంచర్స్ కూడా అందించనుంది. ఇందుకు సంబంధించిన ప్రమోషనల్ వీడియో ఇటీవలే విడుదల చేయగా.. ఆఫ్‌షోర్ ఆయిల్ ప్లాట్‌ఫామ్‌ థీమ్డ్ పార్క్ ప్రపంచంలోనే మొట్టమొదటిది. కాగా త్వరలోనే ఇది పర్యాటక గమ్యస్థానంగా మారుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సైట్ రాజధాని నగరం రియాద్ వెలుపల ఉన్న కొత్త నగరంలో భాగంగా నిర్మించనుండగా, 2023లో ప్రారంభం కానుంది. ఆ రోజు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రోలర్ కోస్టర్‌కు ఇది నిలయంగా ఉండనుంది.

స్త్రీల స్వేచ్ఛను పరిమితం చేసే, మానవ హక్కుల విషయంలో కఠినంగా వ్యవహరించే దేశంలోని సంప్రదాయక చట్టాలను అధిగమించి అనేక మంది అంతర్జాతీయ సందర్శకులకు అనుకూలమైన గమ్యస్థానంగా మారింది. కానీ సమీపంలోని దుబాయ్, అబుదాబి, ఒమన్ వంటి వాటితో పోటీపడగల ఆకర్షణీయమైన గ్లోబల్ హాట్‌స్పాట్‌గా తన స్థానాన్ని మార్చుకోవాలని దేశం నిర్ణయించుకుంది. దశాబ్దం చివరి నాటికి ప్రతి ఏట 100 మిలియన్ పర్యాటకులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘సౌదీ పర్యాటక, వినోద రంగంలో RIG ప్రాజెక్ట్ కీలకంగా మారుతుంది. ఇది మాకెంతో పేరు ప్రతిష్టలతో పాటు ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తుంది. ప్రాజెక్ట్ పరిసరాల్లో పర్యావరణ సంరక్షణ కోసం అత్యుత్తమ ప్రమాణాలు, పద్ధతులను అనుసరిస్తున్నాం. పర్యావరణ పరిరక్షణకు ఇది మరింత మద్ధతుగా నిలుస్తుంది’ అని రిగ్ నిర్వాహకులు పేర్కొన్నారు.

Advertisement

Next Story