‘కట్టప్ప'గా చేయాల్సింది తనే..

by Shyam |
‘కట్టప్పగా చేయాల్సింది తనే..
X

జక్కన్న తీర్చిదిద్దిన ‘బాహుబలి’ సినిమాలో ప్రతీ పాత్ర ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. బాహుబలిగా ప్రభాస్, భళ్లాల దేవుడిగా రానా కటౌట్‌లతోనే ఆడియన్స్‌ను ఫిదా చేయగా.. రాజమాత శివగామిగా రమ్యకృష్ణ రాజసం.. దేవసేనగా అనుష్క మెచ్యూర్డ్ యాక్టింగ్ అదిరిపోయింది. ఇక కట్టప్ప గురించి అయితే చెప్పక్కర్లేదు. అసలు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే క్వశ్చన్‌తోనే కట్టప్ప ఐదేళ్ల క్రితం టాక్ ఆఫ్ ది వరల్డ్ అయిపోయాడు. అఫ్‌కోర్స్ కట్టప్ప క్యారెక్టర్‌లో సత్యరాజ్ తన యాక్టింగ్‌తో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో అందరికీ తెలిసిందే.

ఐతే కట్టప్ప క్యారెక్టర్ కోసం ముందుగా బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌ను అనుకున్నారట దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. కానీ ఆ టైమ్‌లో సంజయ్ జైలులో ఉండటం వల్ల ఆ అవకాశం సత్యరాజ్‌కు వెళ్లిందట. ఇక దేవసేన పాత్రకు కూడా ముందుగా సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతారను పలకరించిందట. కానీ తను బిజీగా ఉండడంతో అనుష్క కాస్త దేవసేనగా తెరపై మెరిసి మెప్పించింది. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

Advertisement

Next Story