సత్యదేవ్ ‘గాడ్ సే’ షూటింగ్ బిగిన్స్

by Jakkula Samataha |
సత్యదేవ్ ‘గాడ్ సే’ షూటింగ్ బిగిన్స్
X

దిశ, సినిమా : హీరో సత్యదేవ్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సత్యదేవ్.. తర్వాత ‘తిమ్మరుసు, గుర్తుందా శీతాకాలం, గాడ్ సే’ చిత్రాలను ప్రకటించాడు. ఇప్పటికే తిమ్మరుసు, గుర్తుందా శీతాకాలం సినిమాల షూటింగ్‌ ప్రారంభించిన ఆయన.. ప్రస్తుతం ‘గాడ్ సే’ సినిమా చిత్రీకరణ ప్రారంభమైనట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. సీకే స్క్రీన్స్ బ్యానర్‌పై సి కళ్యాణ్ నిర్మిస్తున్న సినిమాకు గోపి గణేశ్ దర్శకులు కాగా.. మాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తుండగా.. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో సత్యదేవ్ ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంటోంది.

Advertisement

Next Story