- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పట్నంలో నివాసం.. పల్లెల్లో అధికారం
దిశ, రంగారెడ్డి: జిల్లాలో పరిస్థితులు విచిత్రంగా ఉన్నాయి. గ్రామాల్లో సర్పంచ్‌లుగా ఎన్నికైన వారు పట్నంలో నివాసం ఉంటూ పల్లెల్లో అధికారం చెలాయిస్తున్నారు. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలు హైదరాబాద్ నగరానికి అతి చేరువలో ఉండటంతో సర్పంచ్‌లుగా ఎన్నికై గ్రామాలకు దూరం అవుతున్నారు. దీంతో గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కాక ప్రజలు అవస్థలు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో 23మండలాలకు 21 మండలాల్లోనే 560 గ్రామాలుండగా, వికారాబాద్ జిల్లాలో 18మండలాల్లో 566 గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లోని మెజార్టీ ప్రజా ప్రతిధులు పట్నంలో ఉంటూ పల్లెల్లో అధికారం చెలాయిస్తుండగా అటు అధికారులు సైతం పట్నం నుంచే వచ్చి విధులు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. అధికారి ఉంటే ప్రజా ప్రతినిధి, ప్రజా ప్రతినిధి ఉంటే అధికారులు అందుబాటులో ఉండటం లేదు. దీంతో ప్రజలు నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమం పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపుతోంది. పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు రోడ్లు, మురుగు కాల్వల్లో చెత్త, చెదారాన్ని తొలగిస్తూ గ్రామాలను సుందరంగా తయారు చేస్తున్నారు. అయితే పల్లె ప్రగతి నిర్వహించిన 30రోజులు మాత్రమే ప్రజా ప్రతినిధులు, అధికారులు గ్రామాలను తిరిగి, తర్వాత పట్నంకు వెళ్తుండటంతో మళ్లీ పాతరోజులు దర్శనమిస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ మర్పల్లి మండలంలోని ఓ గ్రామంలో పర్యటించి రోడ్లపై చెత్త, మురికి కాల్వల్లో చెత్త చెదారాన్ని చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ సదరు ప్రజా ప్రతినిధులు, అధికారులపై ఇప్పటివరకు ప్రభుత్వం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
చట్టాల అమలెక్కడా !
రాష్ట్రం ఏర్పాడిన తర్వాత మున్సిపాలిటీ, పంచాయతీలను పటిష్టం చేసేందుకు చట్టలాను తీసుకువచ్చారు. అయినప్పటికీ ప్రజా ప్రతినిధులు, అధికారుల్లో మార్పు రావడం లేదు. అదే సామాన్యులపై శిక్షలు విధిస్తారు కానీ ఆర్ధికంగా, రాజకీయ అండదండలున్న వారికి శిక్షలు నామమాత్రంగానే ఉంటాయనేది వాస్తవం. ఎందుకంటే స్వయంగా కలెక్టర్ వెళ్లి గ్రామాన్ని తనిఖీ చేసి ఆగ్రహం వ్యక్తం చేసినా ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకోక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Tags: Vikarabad Collector, Palle Pragati, Sarpanch, Public Representatives, Rangareddy District, Marpally