ఇద్దరు వార్డ్ సభ్యులతో గ్రామ సభ నిర్వహించిన సర్పంచ్

by Shyam |   ( Updated:2021-12-22 08:06:47.0  )
gramasabha
X

దిశ కొండపాక : సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అంకిరెడ్డి పల్లి గ్రామంలో కలెక్టర్ ఆదేశాలతో పారిశుధ్యం ఇతర అంశాలపై సర్పంచ్ లావణ్య, పంచాయతీ కార్యదర్శి స్వామినాథ్ రెడ్డి గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో హాజరు కావలసిన స్థానిక ఎంపీటీసీ, ఎంపీపీ 10 మంది వార్డు సభ్యులు ముగ్గురు కోఆప్షన్ మెంబర్ లతో పాటు గ్రామ ఉపసర్పంచ్ కి గాను ఇద్దరే ఇద్దరు పంచాయతీ వార్డు సభ్యులతో గ్రామ పంచాయతీ కార్యదర్శి సభ నిర్వహించారు . ఈ క్రమంలో ఒకటవ వార్డు లో గతంలో సీసీ రోడ్డు నిర్మాణం కై చేసిన తీర్మానం ఆరు నెలలు దాటినా ఆ నిర్మాణం జరగకపోవడంతో ఆ నిధులు ఎక్కడ కేటాయించారు నిర్మాణం ఎక్కడ జరిగింది తమకు చూపాలని సభలో అంశాన్ని గ్రామ ప్రజలు లేవనెత్తారు. అంతేకాకుండా పారిశుధ్యం ప్రజా సమస్యలపై మేమంతా ఓటేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు సమస్యలు లెక్కచేయకుండా సభకు హాజరు కాకపోవడంతో గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed