- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్పంచ్, ఎంపీటీసీలే జెండా ఎగురవేయాలి :వైవీబీ రాజేంద్రప్రసాద్
దిశ, ఏపీ బ్యూరో: పంద్రాగస్టు నాడు ప్రభుత్వ పాఠశాలల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలతోనే జెండా ఎగురవేయించాలని టీడీపీ సీనియర్ నేత, ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. విద్యాకమిటీ చైర్మన్లతో జెండా వందనం చేయించాలన్న ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలతోనే జెండాను ఎగురవేయించాలన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టానికి విరుద్ధమన్నారు. సర్పంచ్‌లు, స్థానిక ప్రజాప్రతినిధుల హక్కులను నిర్వీర్యం చేసేలా వైసీపీ ప్రభుత్వం జీవోలను జారీ చేస్తోందని మండిపడ్డారు. ఈ జీవోను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. సర్పంచ్‌లకు వ్యతిరేకంగా నిధులు, విధులు, అధికారాలు తదితర అంశాల్లో చట్ట వ్యతిరేక జీవోలను జారీ చేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు.