ఐసీయూలో సర్పంచ్.. సోషల్ మీడియాలో విరాళం..

by Shyam |
ఐసీయూలో సర్పంచ్.. సోషల్ మీడియాలో విరాళం..
X

దిశ,షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కేశంపేట మండల పరిధిలోని కొనాయపల్లి గ్రామ సర్పంచ్ భయ్యా మల్లేష్ గత కొన్నిరోజులుగా కొవిడ్ తో బాధపడుతూ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాడు. రెండురోజుల క్రితం మల్లేష్ కు ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయిన అతని ఆరోగ్యం క్షీణీస్తోండటంతో మరి కొద్దిరోజులు మల్లేష్ కు చికిత్స అందించాలని డాక్టర్లు చెబుతున్నారు. అసలే నిరుపేద దళిత వర్గానికి చెందిన మల్లేష్ వైద్యం కోసం లక్షలు అవసరం అవుతుండటంతో అతని కుటుంబసభ్యులు దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలంటూ సోషల్ మీడియా ద్వారా వేడుకున్నారు.

దీనికి స్పందించిన కొండారెడ్డి పల్లె గ్రామ సర్పంచ్ పల్లె స్వాతి బాలీశ్వర్ 20వేలు, సంతపూర్ సర్పంచ్ బిజ్వారం అంజయ్య 10వేలు, జై భారత్ రజని 5వేలు, లేమామిడి సర్పంచ్ శ్రీశైలం గౌడ్ 5వేలు, యెర్గమోని రాజ్ కుమార్ 5వేలతో పాటు చాలామంది తమకు తోచిన రీతిలో సహాయం అందజేశారు. విరాళాలు అందజేసిన వారికి మల్లేష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా సాయం చేసేందుకు ముందుకు వచ్చే దాతలు ఫోన్ నెంబర్ 9912546008 కు ఫోన్ ఫే కానీ, ఆ ఫోన్ నెంబర్ ను సంప్రదించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.

Advertisement

Next Story