ఆ స్థలాన్ని కబ్జా చేశారని సర్పంచ్ ధర్నా..!

దిశ, హుస్నాబాద్:

పాఠశాల భూమిని ఎంపీటీసీ కబ్జా చేశారని కొహెడ తహశీల్దార్ కార్యాలయం ఎదుట సర్పంచ్ ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా కొహెడ మండలం శ్రీరాములపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల భూమిని.. ఎంపీటీసీ వేముల శ్రీనివాస్ కబ్జా చేశాడని గ్రామ సర్పంచ్ మంజుల ఆరోపించారు. ఈ నేపథ్యంలో మంగళవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట సర్పంచ్‎తో పాటు గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. స్కూల్ స్థలాన్ని కబ్జా చేసిన ఎంపీటీసీపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

Advertisement